మంత్రి ఇలాకాలో ఆసక్తికరంగా 3వ విడత ఎన్నికలు
మంచిర్యాల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. చెన్నూర్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తుది దశ ఎన్నికలు, ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఈనెల 17న భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. 102 సర్పంచ్, 868 వార్డ్ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి.