ఈ నెల 25న BRSలోకి కాంగ్రెస్ నేత

ఈ నెల 25న BRSలోకి కాంగ్రెస్ నేత

TG: జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు చెప్పారు. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాగా, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదు.