రేషన్ దుకాణాలను పరిశీలించిన తహసీల్దార్
W.G: పెనుమంట్ర మండలంలోని పలు రేషన్ దుకాణాలను తహసీల్దార్ రవికుమార్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెలమూరు, ఆలమూరు గ్రామాల్లోని షాపుల్లో సరుకుల నిల్వల గోడౌన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే లబ్ధిదారులకు పారదర్శకంగా, ఇబ్బందులు లేకుండా రేషన్ అందజేయాలని సూచించారు.