సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్‌లో నేడు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఎం పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి భానోతు సీత రామ్ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వేలం పాటలను ఆపాలని ప్రజాసంఘాలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.