ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
MNCL: జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం శనివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి విందును ఆరగించారు. MLA మాట్లాడుతూ.. రంజాన్ ముస్లింలకు పవిత్రమైన పండుగన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూమేష్ పాల్గొన్నారు.