VIDEO: 'జోరుగా సాగుతున్న ఎర్రమట్టి మాఫియా'
WGL: రాయపర్తి మండలం మొరిపిరాల రెవెన్యూ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి మాఫియా రెచ్చిపోయింది. సెలవు రోజుల్లో టిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టి తవ్వి బయటకు తరలిస్తున్నారు. ప్రభుత్వ గుట్టలు ఒక్కొక్కటిగా అంతరిస్తున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.