'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన MPDO'
VKB: దోమ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను MPDO గ్యామా నాయక్ పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. బేస్మెంట్ పనులు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.