భోజనం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన కంటైనర్
MDCL: శామీర్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై కారు ఆపి భోజనం చేస్తున్నవారిపైకి ఓ కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మౌలాలికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.