ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NLR: బుచ్చి మండలంలోని పెనుబల్లి, మినగల్లు గ్రామాలలో రైతులతో కలిసి బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీటీసీ వినయ్ నారాయణ బీజేపీ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం 303 పార్లమెంటరీ స్ధానాల వరకు చేరిందని.. నేడు ప్రపంచంలోనే అతిపెద్దపార్టీగా అవతరించిందని తెలిపారు.