నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నిర్మల్ జిల్లా భైంసా విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఈఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యుత్ మరమ్మతుల కారణంగా భైంసా, ముథోల్, తానూర్, కుబీర్, కుంటాల మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.