మౌలిక వసతుల కోసం మేయర్‌కు వినతి
VSP: జీవీఎంసీ 48వ వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరుతూ.. వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గంకల కవిత అప్పారావు యాదవ్ మేయర్ పీలా శ్రీనివాస్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. ఇందిరానగర్-2లో వర్షాలకు రిటైనింగ్ వాల్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు.