చమురు కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీల వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని సూచించింది. ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా పెట్రోల్, గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.