వైభవంగా బొడ్డెమ్మ ఉత్సవాలు ప్రారంభం

JGL: దర్శపురిలో శనివారం రాత్రి బొడ్డెమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ రామానందేశ్వరస్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి వారి గద్దెలపై బొడ్డెమ్మను ప్రతిష్టించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటాలు, నృత్యాలు చేస్తూ, మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించారు. అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు.