గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ELR: దెందులూరు మండలం సత్యనారాయణపురం 16 నంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శివాజీ తెలిపారు. ఏలూరు గుండుగొలను మార్గంలో సత్యనారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసినవారు దెందులూరు పోలీసులకు తెలియజేయాలన్నారు