మునగపాక పీఏసీఎస్ ఛైర్మన్‌గా నర్సింగరావు

AKP: మునగపాక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఛైర్మన్ విల్లూరి నూక నర్సింగరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా ఆయనను పలువురు కూటమి నాయకులు అభినందించారు.