సూపర్ మార్కెట్ ఎదుట పూల వ్యాపారుల ఆందోళన

సూపర్ మార్కెట్ ఎదుట పూల వ్యాపారుల ఆందోళన

KMR: జిల్లా కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్‌లో పూలు అమ్ముతున్నారు. తమ పొట్ట కొడుతున్నారని శుక్రవారం పూల వ్యాపారులు సూపర్ మార్కెట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు పూలు విక్రయిస్తూ తమకు గిరాకీ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ సీఐ నరహరి అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు.