బంగారం ఆశ చూపి.. రూ.8 లక్షలు స్వాహా..!

బంగారం ఆశ చూపి.. రూ.8 లక్షలు స్వాహా..!

NTR: తెలంగాణలోని చౌటుప్పల్కు చెందిన హోటల్ యజమాని బ్రహ్మయ్యను మోసం చేసి ఇద్దరు కేటుగాళ్లు రూ.8 లక్షలు కాజేశారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి వంశీ, ప్రసాద్ అనే వ్యక్తులు విజయవాడకు రప్పించి, నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భవానిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.