నేడు సర్వసభ్య సమావేశం

KRNL: వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నేడు MPP దేశాయ్ లక్ష్మీదేవమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సుహాసిని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మండలంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల నివేదిక, గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష ఉంటుందన్నారు. ఆయా శాఖల అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.