ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

KMR: రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. డివిజన్‌లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.