'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

SRCL: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల విద్యాధికారి వినయ్ కుమార్ అన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎంఈవో వినయ్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పరిశుభ్రంగా భోజనం అందించాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు ముఖేష్, ఉపాధ్యాయులు నాగమణి, శ్రీనివాస్, ఉన్నారు.