నేత్రదానానికి జీవన్‌దాన్ నమోదు తప్పనిసరి
TG: నేత్రదాన కార్యకలాపాలు నిర్వహించే అన్ని ఆసుపత్రులు, సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జీవన్‌దాన్ నోడల్ అధికారి ప్రొ. శ్రీభూషణ్‌రాజు ఆదేశించారు. థోటా (THOTA-1994) నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040-23489494 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.