జోనల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
VSP: జీవీఎంసీ జోన్ -7 జోనల్ కమిషనర్ వేధింపులతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డీ. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఒత్తిడితో గ్రామ- వార్డు సచివాలయ ఉద్యోగి నూకరాజు 20న గుండెపోటుతో మరణించాడని చెప్పారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, మహిళా ఉద్యోగులను కూడా వేధిస్తున్నారనే సమాచారం ఉందన్నారు.