VIDEO: కంభంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ప్రకాశం: కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ, ఈ చర్యల వల్ల పేదలు విద్య, వైద్యం కోల్పోతారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి సంతకాలతో గవర్నర్‌ను కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వారు తెలిపారు.