ఈనెల 15న బీటీ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదల
ATP: గుమ్మగట్టు మండలం బీటీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 15న నీటిని విడుదల చేస్తామని ఈఈ సురేంద్ర తెలిపారు. కుడి కాలువ కింద బ్రహ్మసముద్రం మండలంలో చివరి ఆయకట్టు వరకు 1,940 ఎకరాలకు, అలాగే, గుమ్మగట్టు మండలానికి సంబంధించి ఎడమ కాలువ కింద 3,162 ఎకరాలకు నీరు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.