దుర్గమ్మకు రూ.2.67 కోట్ల కానుకలు
TG: విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు పూర్తయింది. 49 హుండీలలోని లెక్కింపు ద్వారా రూ. 2,67,93,738 నగదు వచ్చింది. 215 గ్రాముల బంగారం, 3 కిలోల 320 గ్రాముల వెండి లభించింది. 403 యుఎస్ఏ డాలర్లు, 115 దిర్హమ్స్, 22 ఒమన్ రియాల్స్‌తో పాటు అనేక దేశాల కరెన్సీని భక్తులు సమర్పించారు.