ఎద్దుల బండిపై వినాయకుని నిమజ్జనం

KMR: తాడ్వాయి మండల కేంద్రంలోని చిన్నారులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయం రెండింటినీ మేళవించి, నేడు ఎద్దుల బండిపై వినాయకుని నిమజ్జనం చేస్తున్న దృశ్యం చుసినవారిని వారెవా! అనిపించారు. ఈ చిన్నారి బృందం డీజేలకు, వాహనాలకు బదులుగా తమ పూర్వీకుల సంప్రదాయాన్ని అనుసరించి, ఎద్దుల బండిని అలంకరించి, దానిపై వినాయకుడిని ఊరేగించారు.