యూరియా కోసం రైతుల ఆందోళన..అర్ధరాత్రి నుంచి బారులు

యూరియా కోసం రైతుల ఆందోళన..అర్ధరాత్రి నుంచి బారులు

WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం అర్ధరాత్రి 1 గంట నుంచి రైతులు బారులు తీరారు. యూరియా బస్తాలు దొరుకుతాయో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కాపలాతో టోకెన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.