నాగిరెడ్డిపల్లెలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన..!
ప్రకాశం: కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లెలోని MPP పాఠశాలను MEO-2 బొర్రా వెంకట రత్నం శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు భోజన తయారీపై సూచనలు ఇచ్చారు.