నిడదవోలు ప్రజలకు శుభవార్త చెప్పిన మంత్రులు
AP: తూర్పు గోదావరి నిడదవోలులో మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపాటిలీ డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. నిడదవోలులో రూ.4.4 కోట్ల విలువైన పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.