రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ELR: కారు బైకుని ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరొక వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఈ ఘటన పెదవేగి మండలం వంగూరు - జానంపేట మధ్య బుధవారం చోటు చేసుకుంది. బైకు ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.