హెచ్‌పీవీ టీకా పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

హెచ్‌పీవీ టీకా పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలో హెచ్‌పీవీ టీకా పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. 14 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాకు మొదటి విడతగా 6,390 డోసులు వచ్చాయని, వాటిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే టీకా వేయించుకోవాలని సూచించారు.