నలుగురు దౌత్యవేత్తలను చంపిన ఇజ్రాయెల్
తమ దేశానికి చెందిన నలుగురు దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చినట్లు ఇరాన్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని ఈ విషయాన్ని వెల్లడించారు. దౌత్యవేత్తలు బీరూట్‌లోని రమదా హోటల్‌లో ఉండగా ఇజ్రాయెల్ దాడిచేసినట్లు తెలిపారు. ఈ మేరకు యూఎన్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌కు లేఖ రాశారు. వారిని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఇరవాని ఆరోపించారు.