VIDEO: లింగంపేటలో కనులపండువగా సదర్ సమ్మేళనం

VIDEO: లింగంపేటలో కనులపండువగా సదర్ సమ్మేళనం

MBNR: జడ్చర్ల మండలంలోని లింగంపేటలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల విన్యాసాలు ప్రజలను ఆకర్షించాయి. ముఖ్య అతిథిగా హాజరైన 'జబర్దస్త్' కొమురక్క కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.