ఎస్సీ, ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రావు
KNR: కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో HUZ చెందిన కలకోటి కిషన్ రావు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బహుజన వర్గాల అభ్యున్నతికి, సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కిషన్ రావు ఎన్నిక పట్ల హుజురాబాద్ అంబేడ్కర్ వాసులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.