డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

గద్వాల పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇటీవల మంత్రుల చేతుల మీదుగా తమకు కేటాయించిన ఇళ్లను పొందిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కరెంటు, తాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన మౌలిక వసతులను కూడా పది రోజుల్లోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.