యాలాలలో ఇసుక అక్రమ రవాణా.. 3 ట్రాక్టర్లు సీజ్
VKB: తాండూరు నియోజకవర్గం యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా ఖనిజాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.