రైతు వేదికలోప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు

రైతు వేదికలోప్రిసైడింగ్ అధికారులకు  శిక్షణ తరగతులు

NZB: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం రుద్రూర్ రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల్లో కొత్తగా పాల్గొంటున్న అధికారులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.