'రూపాయి పతనం.. ప్రతికూలమేమీ కాదు'

'రూపాయి పతనం.. ప్రతికూలమేమీ కాదు'

రూపాయి విలువ పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూపాయి బలహీనపడటం అనేది ఎగుమతిదారులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. రూపాయి పతనాన్ని ఆర్థిక వ్యవస్థకు ఒక సమతుల్య అంశంగా చూడాలని, ఇది ఎగుమతి రంగం వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే దీంతో భారతీయ వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా లభిస్తాయని వెల్లడించారు.