అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
అన్నమయ్య: ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి శివప్ప విద్యార్థులకు సూచించారు. గురువారం మదనపల్లెలోని ఓ పాఠశాలలో వేసవిలో సంభవించే ప్రమాదాలు, మంటలను ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. భయపడకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని, మంటలు చెలరేగినప్పుడు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని తెలిపారు.