గంజాయి నియంత్రణకు ఆపరేషన్ వజ్రప్రహర్

గంజాయి నియంత్రణకు ఆపరేషన్ వజ్రప్రహర్

ASR: గంజాయి నివారణకు చేపడుతున్న ఆపరేషన్ వజ్రప్రహర్‌లో భాగంగా జీకే వీధి, కొయ్యూరు మండలాల పోలీసులు సంయుక్తంగా సరిహద్దు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అన్నవరం, కన్నవరం ప్రాంతాల్లో జీకే విధి సీఐ సుధాకర్ నేతృత్వంలో రెండు మండలాల ఎస్సైలు బుధవారం ఇంటింటికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 లీటర్ల సారా, పులుపు లభ్యమైనట్లు ఎస్సై సురేష్ తెలిపారు.