కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన గంగవ్వ
JGL: జిల్లా లంబాడి పల్లెకు చెందిన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ ఐకేపీ కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని గ్రామస్థులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ సత్య ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలం కేటాయిస్తే స్వచ్చందంగా నిధులు సమకూర్చుకుని అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.