నడిరోడ్డుపై పార్కింగ్.. పట్టించుకోని అధికారులు..!
GNTR: తెనాలి గాంధీచౌక్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఐతే నడిచి వెళ్లేందుకు కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అటువంటి చోట పలువురు రోడ్డు మీద వరకు వాహనాలు నిలిపి ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. గాంధీచౌక్ నుంచి బోసురోడ్డు మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్‌ల ఎదుట రోడ్డు మధ్య వరకు బైక్‌లు పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.