అగ్ని ప్రమాదంలో మహిళ మృతి
అనకాపల్లి: పట్టణం తుంపాలలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. గగనం సత్యవతి (54) అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. భర్త ఆనందరావు దోమల చక్రం వెలిగించి పాలు కోసం బయటకు వెళ్ళాడు. దుప్పటికి దోమల చక్రం తగిలి మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన సత్యవతిని 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే మూర్తి చెందింది.