కందుకూరు సీఐగా షేక్ అన్వర్ భాష

నెల్లూరు: కందుకూరు నూతన సీఐగా షేక్ అన్వర్ భాష నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన కే. వెంకటేశ్వరరావు వీఆర్‌కు వెళ్లగా ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న అన్వర్ భాషను నియమిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్వర్ భాష కందుకూరు సీఐగా బాధ్యతలు స్వీకరించారు. కందుకూరు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.