పరకాలలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు
HNK: పరకాల పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం జిల్లా డీఎంహెచ్వో అప్పయ్య, జిల్లాసుపత్రి సమన్వయ అధికారి గౌతమ్ చౌహాన్‌తో కలిసి సంబంధిత అధికారులు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.