CM రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే

HYD: CM రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన ఒక జోకర్ పాలన అయ్యిందందంటూ విమర్శలు గుప్పించారు. ప్రజా పాలనలో తుపాకీ రాముని మాటలను మైమరపించేలా పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. మాయమాటలు, మోసపూరిత హామీలతో కాలయాపన చేస్తున్నారని ఉద్ఘాటించారు. KTR, KCR, హరీష్ రావులను జైలుకి పంపుతాము అంటూ ప్రజలను తప్పు దోవ పట్టించడం తప్ప వీళ్లతో ఒరిగేది ఏమి లేదని పేర్కొన్నారు.