వ్యూహరచనలో జుక్కల్ ఎమ్మెల్యే.. అడూర్లో ప్రచార జోరు!
KMR: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడూర్ నియోజకవర్గ ఏఐసీసీ పరిశీలకులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. శనివారం అడూర్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై వ్యూహరచన చేశారు. ఈ నెల 30న అడూర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.