వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సుమిత్రనగర్‌లో వ్యభిచార గృహంపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని స్టేట్ హోమ్‌కు తరలించారు.