ఆర్టీసీ బస్సు- టాటా ఏసీ ఢీ.. తప్పిన ప్రమాదం
NGKL: అచ్చంపేట- నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బస్సు, టాటా ఏసీ వాహనం ఢీకొన్నాయి. వేరుశనగ లోడుతో అచ్చంపేట నుంచి వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని నాగర్ కర్నూల్ నుంచి వస్తున్న బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.