పాఠశాల మౌలిక సదుపాయాలపై DEO ఆరా..!
SKLM: జలుమూరులో ఉన్న బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో రవిబాబు ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనాలు వడ్డించాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.